Skip to main content

Bhagavad Gita: బుల్లి భగవద్గీత.. స్మాలెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌తో అబ్బురపరుస్తున్న విద్యార్థి

కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ.
Bhagavad Gita
బుల్లి భగవద్గీత.. స్మాలెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌తో అబ్బురపరుస్తున్న విద్యార్థి

రాజమహేంద్రవరంలో ఇంటరీ్మడియెట్‌ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్ రావు, హైసూ్కల్‌ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు.

చదవండి: 

JOSSA: జోసా ఆఖరు తేదీ ఇదే..

Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Published date : 25 Oct 2021 04:37PM

Photo Stories