Andhra Pradesh: ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా యూనిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 21న స్విచ్ ఆన్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘మొత్తం మూడు విడతల్లో పూర్తయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,470 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
GK International Quiz: నాటో సైనిక వ్యాయామం 'కోల్డ్ రెస్పాన్స్ 2022' ఎక్కడ జరిగింది?
Manufacturing Facility: బిలిటీ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : బలభద్రపురం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్