Skip to main content

Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలుప్రారంభం కానున్నాయి.
Inter
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 25 ఉదయం 9 గంటల నుంచి మొదలయ్యే ఈ పరీక్షలకు 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్‌ స్వా్కడ్స్‌ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌లో అస్వస్థతగా ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్ గదిలో ఉంచుతారు. ఓపిక ఉంటే అక్కడైనా పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురైతే 040–24601010 లేదా 040–24655021కు కంట్రోల్‌రూం నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

చదవండి: 

JOSSA: జోసా ఆఖరు తేదీ ఇదే..

IIIT: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

Published date : 25 Oct 2021 04:17PM

Photo Stories