Skip to main content

IIIT: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ట్రిపుల్‌ ఐటీల్లో 4,400 సీట్ల భర్తీకి అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది.
IIIT
ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

వర్సిటీ చాన్సలర్‌ ఆచార్య కేసీ రెడ్డి అక్టోబర్‌ 22న కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అడ్మిషన్ల ప్రక్రియను నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో నవంబర్‌ 22 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఎందులోనైనా విద్యార్థులు చేరొచ్చు. సెప్టెంబర్‌ 26న ఆర్జీయూకేటీసెట్‌–2021ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 6న ఫలితాలను విడుదల చేశారు. 

కౌన్సెలింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టీఫికెట్లు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్ పరిధిలోకి వస్తారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ అనంతపురం, కర్నూలు జిల్లాల అభ్యర్థులు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ పరిధిలోకి వస్తారు. అభ్యర్థులు ఏదైనా కళాశాలలో చేరి ఉంటే టీసీ తెచ్చుకునేందుకు గడువు ఇస్తారు. మిగిలిన ఒరిజినల్‌ సరి్టఫికెట్లను కౌన్సెలింగ్‌ సమయంలో తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ ఏడాది జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను మాత్రమే అనుమతిస్తారు. మరిన్ని వివరాలకు https://www.rgukt.in చూడొచ్చు.

చదవండి:

PGECET: పీజీసెట్‌–2021 ప్రారంభం

హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్‌

Published date : 23 Oct 2021 04:53PM

Photo Stories