PGECET: పీజీసెట్–2021 ప్రారంభం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 53 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మొదలయ్యాయి. ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, యోగి వేమన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ ఉమ్మడి పరీక్షను అక్టోబర్ 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు అక్టోబర్ 22న ఇంగ్లి‹Ù, బోటనీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కోర్సులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,685 మంది విద్యార్థులు హాజరయ్యారు. 85 శాతం హాజరు నమోదైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించేందుకు యోగివేమన వర్సిటీలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ తీరును అధికారులు పర్యవేక్షించారు. కాగా, కడపలో పరీక్ష కేంద్రాలను ఏపీ పీజీసెట్ చైర్‌పర్సన్, వైవీయూ వైస్ చాన్స్ లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, కనీ్వనర్ ఆచార్య వై.నజీర్‌అహ్మద్‌లు పరిశీలించారు.
చదవండి: