Govt College for Men : ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాలకు ప్లాటినం జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న పూర్త విద్యార్థులు..
వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల 75 వసంతాల ప్లాటినం జూబ్లీ వేడుకలు రెండోరోజు శనివారం ఉత్సాహంగా సాగాయి. వేడుకల్లో భాగంగా సమాజంలో గౌరవంగా బతికేలా తయారు చేసిన మా ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. రెండో రోజు ఉదయం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కళాశాల నుంచి మహావీర్ జైన్ సర్కిల్ వరకు జాయ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కేరళ టూరిజం డిపార్టుమెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పూర్వ విద్యార్థులంతా ఒకటిగా తయారై ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు.
Medical Colleges : వైద్య కళాశాలలు ప్రవేటుకు.. విద్యార్థుల భవిష్యత్తు..!
ఏపీ విశ్రాంత డీఐజీ కె. లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ కళాశాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. డబ్బు సంపాదించాక దాన్ని సామాజిక అవసరాలకు వెచ్చించాలని దానివల్ల జీవన కాలం పెరుగుతుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ విశ్రాంత ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎ.ఆర్.ఎం. రెడ్డి మాట్లాడుతూ పేదల కళాశాల ఆర్ట్స్ కాలేజి అని, ఎంతో మంది నాలాంటి వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిందన్నారు. ఇక్కడి అధ్యాపకుల అంకితభావం, నిబద్ధత గొప్పవన్నారు. గవర్నమెంటు కాలేజిలో చదివితే ఏమవుతారు అంటే ఇలా సివిల్ సర్వెంట్స్ అవుతారని చెప్పాలన్నారు.
పూర్వ విద్యార్థి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివినవారు విభిన్నరంగాల్లో రాణించారని ఉదహరించారు. కళాశాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ద్వారా నిధులు కచ్చితంగా తెచ్చి ప్రగతి దిశగా తీసుకువెళుతామన్నారు. విశ్రాంత తిరుపతి మున్సిపల్ కమిషనర్ పి. మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ బీకాం కోర్సులో ప్రతిభావంతులకు బంగారు పతకం కోసం ప్రతి ఏటా రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారు. శాసనమండలి మాజీ సభ్యుడు ఎం. వెంకటశివారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువులు నేర్పిన కళాశాలకు ఎమ్మెల్సీగా కొంత రుణం తీర్చుకున్నానని తెలిపారు.
NAAC A Grade : ఈ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్..
హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రఖ్యాత కథా రచయిత్రి ఉషారాణి మాట్లాడుతూ ‘గుప్పెడంత మనసు’ టీవీ సీరియల్లో రిషి క్యారక్టర్‌ను ఆనాటి తమ అధ్యాపకుడి గురించి స్ఫూర్తి పొంది రాసిందేనని.. ఆ రోజుల్లో అధ్యాపకుల ఆదర్శనీయ జీవితం ఎంతగొప్పదో అవగతం చేసుకోవచ్చన్నారు. చైతన్య కెమికల్స్ అధిపతి రామమూర్తి, ఎస్.కె.యూ మాజీ వీసీ ఎం.ఆర్.కె. రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడతూ కళాశాల ప్రతి భావంతుల కోసం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత ఆచార్య బి.ఎల్.ఎస్. ప్రకాష్‌రావు రూ.2 లక్షలు ప్రకటించారని, కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు ఎంతెంత ఇచ్చారనే జాబితాను వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
AP Schools : తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం..