Skip to main content

హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్‌

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్‌–2021కు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్‌
హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్‌

అక్టోబర్‌ 22 నుంచి 26 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పీజీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య వై.నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43,632 సీట్లకు పీజీసెట్‌ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాలు, ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో 53 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

చదవండి: 

Inter: ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి

53 ఏళ్ల వయసులో మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ

Published date : 22 Oct 2021 03:20PM

Photo Stories