Inter: ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
Sakshi Education
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందితోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారులను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రానికి అనుమతించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయాలని పేర్కొన్నారు. అక్టోబర్ 25 నుంచి జరిగే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఏర్పాట్లపై అక్టోబర్ 21న ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు సజావుగా రాయాలని విద్యార్థులకు సూచించారు. 70% సిలబస్‌తోనే ప్రశ్నపత్రం రూపొందించామని, సిలబస్‌ను, ప్రతి సబ్జెక్టు మోడల్ ప్రశ్న పత్రాలను వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిద్వారా 4,59,228 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని వివరించారు.
కలెక్టర్లకు మంత్రి చేసిన సూచనలు..
- సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా స్థాయిలోని మానిటరింగ్, హైపవర్ కమిటీలు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి
- వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్, క్లర్కులు, అటెండర్లుగా నియమించాలి.
- విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రా లకు అనుమతిస్తారు. సకాలంలో వారు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి.
- విద్యార్థులు మంచినీటి బాటిల్స్, శానిటైజర్లు తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. పరీక్షకు ముందు బెంచీలు, డ్యూయల్ డెస్క్‌లు, డోర్లు, కిటికీలను శానిటైజ్ చేయాలి. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే అనుమతించాలి. ఇందుకు వీలుగా పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థి వివరాలను అధికారులు ముందే తెప్పించుకోవాలి.
Published date : 22 Oct 2021 12:25PM