School Holidays: వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు..అలాగే
Sakshi Education
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్ ప్రభుత్వం నవంబర్ 13వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 15వ తేదీ నుంచి దేశ రాజధానిలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం...
కాగా ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు వర్క్ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విలైనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.
Published date : 13 Nov 2021 07:30PM