Skip to main content

Admissions: CPET డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు

Admission for 10th Supplementary Pass Students in Guntur  CPET Diploma Admissions  Guntur Education Opportunities for Supplementary Exam Pass Students
CPET Diploma Admissions

గుంటూరు ఎడ్యుకేషన్‌: విజయవాడలోని కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌–టెక్నాలజీ (సీపెట్‌)లో టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

మూడేళ్ల వ్యవధి గల డిప్లమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లమా ఇన్‌ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ)లలో ప్రవేశానికై ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్‌ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీ–యింబర్స్‌మెంట్‌ సదుపాయంతో పరిమిత సంఖ్యలో ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.

ఆయా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు ప్లాస్టిక్స్‌ రంగంలో బహుళజాతి సంస్థల్లో జూనియర్‌ ఇంజినీర్‌, మౌల్డ్‌ డిజైనర్‌ అండ్‌ మేకర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (మెయింట్‌నెన్స్‌) వంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ప్రారంభ వేతనం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 78935 86494 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

Published date : 02 Jul 2024 09:23AM

Photo Stories