Teach Tool : టీచ్ టూల్‌తో మెరుగైన బోధన.. నేటి నుంచి ఈ రెండు జిల్లాల్లో కూడా..!
రాయవరం: తరగతి గదిలో అభ్యసన నైపుణ్యాల మెరుగుదలకు రాష్ట విద్యాశాఖ ఆచరణాత్మక ప్రణాళికతో ముందుకెళ్తోంది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో టీచ్ టూల్ పేరుతో ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్లు/ఎస్‌జీటీ/సీఆర్‌ఎంటీలకు టీచ్ టూల్ అబ్జర్వేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. టీచ్ టూల్ ద్వారా ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.
Education Hub : ఎడ్యుకేషన్ హబ్ గా కాటారం.. ప్రత్యేకతలు ఇవే!
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పర్చేందుకు.. అదే సమయంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు ఎస్‌సీఈఆర్‌టీ పలు రకాల పద్ధతులను అధ్యయనం చేస్తోంది. టీచింగ్ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? టీచర్‌కు, విద్యార్థికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ ఉపయోగపడుతున్నాయి. పరిశీలనాంశాలను డిజిటల్ బేస్డ్‌గా యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి బోధనా పద్ధతులపై 1,098 మందికి మాస్టర్‌ట్రైనీలు అవగాహన కల్పించనున్నారు.
Department of Education: 25 వేల మంది ఎస్‌జీటీల బదిలీ
నేటి నుంచి రెండు జిల్లాల్లో..
రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లా నుంచి శిక్షణ పొందిన 25 మంది మాస్టర్ ట్రైనీలు టీచ్‌టూల్ అబ్జర్వర్స్‌గా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు శిక్షణనిస్తుండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు తొమ్మిది రోజుల శిక్షణనిస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, అన్నవరం, జగ్గంపేటల్లో రెండు బ్యాచ్‌లుగా సర్టిఫైడ్ అబ్జర్వర్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా తూర్పుగోదావరి నుంచి 167, కాకినాడ జిల్లా నుంచి 160, కోనసీమ జిల్లా నుంచి 97 మంది సర్టిఫైడ్ అబ్జర్వర్స్‌గా శిక్షణ పొంది 5,936 తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనను టీచ్‌టూల్ యాప్ ద్వారా నమోదు చేశారు. ఒక్కో బ్యాచ్‌లో 45 మందికి తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
PNB Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
సర్టిఫైడ్ అబ్జర్వర్స్ తరగతి గదుల్లో పరిశీలనా సమయంలో బిహేవియర్స్ స్కిల్స్ ఎలా ఉంటాయి? బిహేవియర్స్ స్కిల్స్‌కు కోడ్స్ ఎలా ఇవ్వాలి? తదితర విషయాలపై శిక్షణ పొందనున్నారు. శిక్షణ అనంతరం అబ్జర్వర్స్ తరగతి గదుల్లో పరిశీలించిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకుని యాప్‌లో నమోదు చేస్తారు. నమోదైన అంశాలు యాప్ ద్వారా గుర్తించి, టీచింగ్‌లోని లోటుపాట్లను సరిచేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ(ఎల్‌ఎఫ్‌ఈ)తో కలిసి సంయుక్తంగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్(టీపీడీ) కోర్సులు తయారు చేసి టీచర్స్‌కు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర విద్యాశాఖతో పాటుగా లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ అనే స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
గత విద్యా సంవత్సరంలో 5,936 తరగతి గదుల పరిశీలన
ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక్కో సర్టిఫైడ్ అబ్జర్వర్ తరగతి గదుల్లోని ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను టీచ్ టూల్స్ ద్వారా పరిశీలన చేశారు. ఈ విధంగా 5,936 ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను పరిశీలన చేసి, టీచ్ ఏపీ యాప్‌లో నమోదు చేశారు. అబ్జర్వర్స్ టీచ్ టూల్ నివేదికలను రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి(ఎస్‌ఈసీఆర్‌టీ)కి పంపించారు.
గుణాత్మక విద్యను అభివృద్ధి చేసేందుకు..
ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ క్వాలిటీ లెర్నింగ్ (గుణాత్మక విద్య) లక్ష్యంగా సాల్ట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి? విద్యార్థి స్థాయికి వెళ్లి బోధన చేస్తున్నారా? ఉపాధ్యాయుడి బోధనను విద్యార్థులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఉపాధ్యాయుడు బోధనలో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అమలు చేస్తున్నారా? లేదా? తదితర విషయాలను టీచ్ టూల్ ద్వారా సర్టిఫైడ్ అబ్జర్వర్స్ తరగతి గదుల్లో పరిశీలన చేస్తున్నారు.
జిల్లా ఎంపికైన అబ్జర్వర్స్
తూర్పుగోదావరి 270
కాకినాడ 405
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 423
Tags
- Teachers
- Schools
- students education
- teaching with technology
- teach tool
- School Students
- new academic year
- education Development
- certified observers
- Teach Tool App
- school teachers
- Education News
- Sakshi Education News
- SALTproject
- TEACHTOOLobservation
- SCERTtraining
- teacherimprovement
- teacherobservation
- AndhraEducation