Postal Department: విద్యార్థులకు స్కాలర్‌షిప్ పరీక్ష
Sakshi Education
మద్నూర్(జుక్కల్): దీన్‌దయాల్ స్పర్శ్ యోజనలో భాగంగా తపాలా శాఖ ప్రతి యేడు ఫిలాటలీ స్కాలర్‌షిప్ పరీక్షలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా మండల కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్‌లో అక్టోబర్ 1న విద్యార్థులకు తపాలా శాఖ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ పరీక్షలు నిర్వహించినట్లు పోస్టాఫీస్ అధికారి గజ్జల వేణు తెలిపారు.
ఈ పరీక్షలకు మద్నూర్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన 6, 7, 8, 9 తరగతులకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షలో ప్రతి తరగతి నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులకు(తరగతికి 10 చొప్పున) ఒక్కొక్కరికి రూ.6 వేల నగదు బహుమతి అందించనున్నామని ఆయన అన్నారు. కార్మెల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదవండి:
Single Girl Child Scholarship 2023: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్–2023.. ఎవరు అర్హులంటే..
CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Published date : 02 Oct 2023 03:39PM