Global Innovation Hub: గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధరాబాబు

తెలంగాణలో 6,000 స్టార్టప్ సంస్థలు, 1,500 చిన్న, మధ్యతరహా సాఫ్ట్‌వేర్ సంస్థలు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జనవరి 10వ తేదీ నెదర్లాండ్స్‌కు చెందిన ఆరిక్ట్ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కొత్త కేంద్రం ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు రావడం సంతోషకరమైన విషయమని మంత్రి తెలిపారు.
ఇప్పటికే ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన విప్లవాత్మక వృద్ధితో రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం జాతీయ సరాసరి నుండి మించిపోయిందని మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే, ప్రఖ్యాత సంస్థలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) తెలంగాణలో నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, దీంతో యువతకు అధిక ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుందని వివరించారు.
Bhu Bharati Act: తెలంగాణలో.. 'భూ భారతి'కి గవర్నర్ ఆమోదం
పరిశ్రమలు తగిన నైపుణ్యమున్న మానవ వనరులను అవసరం చేసుకుంటున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఈ అవసరాలను తీర్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్‌ను టాలెంట్ సిటీ, టెక్ సిటీ, ఇన్నోవేషన్ సిటీగా అభివర్ణిస్తూ, అక్కడ స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.