Skip to main content

Telangana : ఒకే దెబ్బ‌కు 100 మంది పంచాయతీ కార్యదర్శుల ఔట్... కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : నల్లగొండ కలెక్టర్ ఇల త్రిపాఠీ సంచ‌న‌ల‌ నిర్ణయం తీసుకుంది. విధుల్లో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
Ila Tripathi IAS

100 మంది పంచాయతీ కార్యదర్శులను సర్వీస్ బ్రేక్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శులు ఆరు నెలల పాటు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరు అవడంపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. 

పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడం మానేసి.. 
కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అనారోగ్యం పేరుతో విధులకు గైర్హాజరు అయి కూడా జీతాలు తీసుకున్నట్లు కలెక్టర్ విచారణలో బట్టబయలైంది. ఈ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు వాళ్ల పోస్టింగ్ కోసం జిల్లా పాలనాధికారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. టీఎన్జీవో సంఘం డీపీఓ ఆఫీస్ను గుప్పిట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడం మానేసి.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

➤☛ Ila Tripathi IAS Success Story : ఆ టైమ్‌లోనే ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వాల‌నుకున్నా.. కానీ మా అమ్మ, నాన్న నా కోసం...

ఇలా కూడా మోసం చేస్తారా...?
ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శులు సొంతానికి వాడుకున్నారని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు అందాయి. డబుల్ రసీదు పుస్తకాలు మెయింటెనెన్స్ గురించి అడిగే వారు ఎవరూ లేకపోవడంతో ఆన్లైన్‌లో తక్కువ చూపించి ఆఫ్లైన్లో ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంబీ (మెజర్ మెంట్ బుక్) రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయని, ఇలా చేయడం చట్ట విరుద్ధమని కలెక్టర్ మండిపడ్డారు.

కలెక్టర్ నిర్ణయంతో..
కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్స్, పెన్షన్ల విషయంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.

Published date : 18 Jan 2025 11:09AM

Photo Stories