JPS: జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు రాత పరీక్ష తేదీలు ఖరారు
దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 10 చివరి తేదీగా నిర్ణయించింది. రాత పరీక్ష తేదీలను ఇటీవల విడుదల చేసింది. డిసెంబర్ 19వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3:00 గంటల నుండి 5:00 గంటల వరకు పేపర్2గా నిర్ణయిచారు.
రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్‌లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది.
చదవండి:
Panchayat Secretary Previous Papers
పంచాయతీలు, సచివాలయ ఉద్యోగుల బాధ్యతల్లో పలు మార్పులు
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకం