ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకం
Sakshi Education
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 425 గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రిటైర్డ్, పదోన్నతి, చనిపోయిన కార్యదర్శుల స్థానే కొత్త పోస్టులు మంజూరయ్యే వరకు.. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మే 26 (మంగళవారం)నవెల్లడించింది. ఈ మేరకు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నియామకాలు చేపట్టాలని పీఆర్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఇటీవలే ఆదేశించారు. ఈ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరికి నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్న ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా డిగ్రీ ఉత్తీర్ణతను నిర్ణయించారు.
Published date : 27 May 2020 04:23PM