Amitha Polimetla: హిజ్రాల జీవనంపై పరిశోధన
రాష్ట్రంలోని తీరప్రాంతం కలిగిన 9 జిల్లాల్లో 270 మంది హిజ్రాల నుంచి సమాచారాన్ని సేకరించారు. వీరిలో 268 మంది తమ వివరాలు సిద్ధాంతగ్రంథంలో పొందుపరచడానికి అంగీకరించారు. ఇద్దరు తమ వివరాలు బహిర్గతం చేయవద్దని కోరారు. సోషల్ వర్క్ విభాగం ఆచార్యులు కె.విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో అమిత అధ్యయనం చేసి డాక్టరేట్ పొందారు.
చదవండి: Success Story: అదరగొట్టిన ఏపీ విద్యార్థి... ఇంటెల్‌లో 1.2 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను ఏప్రిల్ 17న స్వీకరించారు. గతంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి హిజ్రాల సమస్యలు, చేపట్టాల్సిన చర్యల గురించి వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని పరిశోధకురాలు అమిత తెలిపారు. తాను చేసిన పరిశోధన ప్రభుత్వానికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. సాల్వటోరియన్ సభ సహాయంతో ‘నీ తోడు’ ఎన్‌జీవోను స్థాపించి హిజ్రాల సంక్షేమానికి కృషి చేస్తున్నానని ఆమె వివరించారు.
చదవండి: Pharmacy Students: నేరేడు ఆకుల్లోనూ ఔషధాలు..ఫార్మసీ విద్యార్థుల పరిశోధన