Skip to main content

NTRUHS: ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో 2021–22 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన అనంతరం విద్యార్థుల ప్రాథమిక మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 25న విడుదల చేసింది.
NTRUHS
ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల

ఈ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే ntrugmedadm21@gmail.comకు ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు అభ్యర్థులు మెయిల్‌ చేయాలన్నారు. అదే విధంగా చి్రల్డన్ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌ (సీఏపీ), ఎన్ సీసీ విభాగాల కింద ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక ప్రాధాన్యత జాబితాను ప్రకటించారు. అభ్యర్థనలను మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు తెలియజేయాల్సి ఉంటుంది. సీఏపీ విభాగానికి సంబంధించి అభ్యర్థనలను apcapadmissions@gmail.comకు, ఎన్ సీసీ విభాగానికి సంబంధించిన అభ్యర్థనలను ntrugnccadm21@gmai.comకు మెయిల్‌ చేయాలని పేర్కొన్నారు. 

చదవండి:

Medical Colleges: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత..

​​​​​​​ TS EAMCET 2022: జూన్‌లో టీఎస్‌ ఎంసెట్‌!

KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

Published date : 26 Feb 2022 02:19PM

Photo Stories