Skip to main content

KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

విద్యార్థులు కాలేజీలు, ప్రాధా న్యాల వారీగా ఇచ్చిన ఆప్షన్ల ప్రకారమే మెడికల్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 16న ఒక ప్రకటనలో తెలిపింది.
knruhs
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం

తొలి విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌పై పలువురు విద్యార్థులు వ్యక్తం చేసిన సందేహాలు, ఆందోళనలపై విశ్వవిద్యాల యం స్పందించింది. విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లను ఆన్ లైన్ లో నమోదు చేశారో ఆ ప్రకారమే కేటాయించామని తెలిపింది. విద్యార్థి ఒకేసారి కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కసారి నమోదు చేసుకున్న తర్వాత ప్రాధాన్యక్రమాన్ని మార్చడం కుదరదు. అన్ని విడతల కౌన్సెలింగ్‌కు మొదట ఇచ్చిన ప్రాధాన్య క్రమమే వర్తిస్తుంది.

ప్రాధాన్యతల మార్పు కుదరదు

ఒకవేళ విద్యార్థికి తొలివిడతలో ఒక మెడికల్‌ కాలేజీలో సీటొచ్చి.. రెండో విడతలో ప్రాధాన్యక్రమాన్ని అనుసరించి అంతకంటే మంచి కాలేజీలో సీటొస్తే విద్యార్థి అందులో చేరాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి విడత కాలేజీలో సీటు రద్దవుతుంది. రెండో విడతలో వచ్చిన కాలేజీలో విద్యార్థి తప్పనిసరిగా చేరాల్సిందే. ఇప్పుడు ప్రాధాన్యత మార్చుకుంటాను, అదే కాలేజీలో కొనసాగుతానంటే కోరుకుంటే కుదరదని వర్సిటీ తేల్చిచెప్పింది. ఎందుకంటే తొలివిడత సీటు దానంతటే రద్దు అవుతుంది. ఏ విడతలోనైనా ఇదే విధానం కొనసాగుతుంది. అందుబాటులో ఉన్న సీట్లను బట్టి ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి కాలేజీలు మారుతుంటాయి. మారిన ప్రతి సందర్భంలోనూ విద్యార్థి సంబంధిత కొత్త కాలేజీలో చేరిపోవాల్సి ఉంటుంది. విద్యార్థి ఒక కళాశాలలో చేరి, తిరిగి మరో కాలేజీలో చేరాల్సిన సందర్భాల్లో కాలేజీలు ట్యూషన్‌ ఫీజు సహా ఏ తరహా ఫీజు కూడా అట్టిపెట్టుకోకూడదు. ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులకు మొత్తం ఫీజు తిరిగి ఇచ్చేయాలని విశ్వవిద్యాలయం వెల్లడించింది.

చదవండి: 

వైద్య విద్యార్థుల మొర: మమ్మల్నీ పాస్‌ చేయండి..!

బీడీఎస్ యాజమాన్య కోటాకు తగ్గిన కటాఫ్

ఆ విద్యార్థి ఎంబీబీఎస్‌కు అర్హురాలే ఎన్‌ఆర్‌ఐ కోటాలో అడ్మిషన్ ఇవ్వండి: హైకోర్టు

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపుకు సర్కార్ ‘నో’

Published date : 17 Feb 2022 04:06PM

Photo Stories