ఆ విద్యార్థి ఎంబీబీఎస్‌కు అర్హురాలే ఎన్‌ఆర్‌ఐ కోటాలో అడ్మిషన్ ఇవ్వండి: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని వెస్ట్‌హార్ట్ ఫోర్ట్ బోర్డులో ప్లస్ టూ విద్యను పూర్తి చేసిన విద్యార్థి శ్రీకీర్తి రెడ్డి ఎంబీబీఎస్ చదివేందుకు అర్హురాలేనని హైకోర్టు స్పష్టం చేసింది.
10వ తరగతి నుంచే శ్రీకీర్తి రెడ్డి బయాలజీ చదివిందని, 11, 12 తరగతుల్లో కూడా బయాలజీలోని అన్ని సబ్జెక్టులు ఆమెకు బోధించామని వెస్ట్‌హార్ట్ ఫోర్ట్ బోర్డు ధ్రువీకరించిన నేపథ్యంలో ఆమెకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. శ్రీకీర్తి రెడ్డి ఎంబీబీఎస్ చదివేందుకు అనర్హురాలంటూ కాళోజీ వర్సిటీ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆమె తండ్రి వీఆర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
Published date : 04 Jan 2021 03:31PM