బీడీఎస్ యాజమాన్య కోటాకు తగ్గిన కటాఫ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కటాఫ్ మార్కులు తగ్గించి నట్లు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం ఓ ప్రక టనలో తెలిపింది.
జనరల్ అభ్యర్థులు 40 పర్సెంటైల్, 113 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 30 పర్సెంటైల్, 87 మార్కులు, దివ్యాంగులకు 35 పర్సెంటైల్, 99 మార్కులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆసక్తి ఉన్న అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి 12వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలి పింది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్, ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని సూచించింది.
Published date : 10 Feb 2021 05:07PM