Skip to main content

NEET PG 2024 Exam Date: నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌పై కీలక ప్రకటన

NEET PG 2024 Exam Date

సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్‌)‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వాయిదా పడ్డ నీట్‌-పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ను ఆగస్ట్‌ 11న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు షిప్ట్‌లలో ఆ పరీక్ష జరగనుంది. కటాఫ్ తేదీ, ఇతర వివరాల్ని ఆగస్ట్‌ 15న వెల్లడిస్తామని పేర్కొంది. 

NEET Paper Leak : నీట్ పేప‌ర్ లీకేజ్ విష‌యంలో ప్ర‌భుత్వంపై....

‘ఎన్‌బీఈఎంఎస్‌ 22-06-2024న వాయిదా వేసిన నీట్‌ పీజీ ఆగస్ట్‌ 11న నిర్వహిస్తున్నాం. రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్ష జరగనుంది’ అని విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.  

కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో..
ఇటీవల నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా తర్వలో జరగనున్న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రం ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జరగనుంది. పరీక్షను ఎన్‌బీఈఎంఎస్‌ జరుపుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీట్‌ పీజీ పరీక్ష నిమిత్తం అవసరమయ్యే టెక్నికల్‌ సపోర్ట్‌ను ఎన్‌బీఈఎంఎస్‌తో కలిసి ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ అందించనుంది.

JEE Aspirant suicide In Kota: కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌, రెండేళ్లుగా కోచింగ్‌ తీసుకుంటూ..

 

Published date : 05 Jul 2024 03:46PM

Photo Stories