TSCPGET 2023: పీజీ కోర్సుల ప్రవేశాల చివరి జాబితా విడుదల
చివరి విడత కౌన్సెలింగ్‌కు 11325 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వగా.. 6491 మందికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఓయూతో పాటు కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాలు, జేఎన్‌టీయూల్లోని వివిధ పీజీ కోర్సుల్లో 50 వేల సీట్లకు.. 23 వేల సీట్లు భర్తీ కాగా 27 వేల సీట్లు మిగిలినట్లు వివరించారు. వివిధ కళాశాలల్లో ఎంఏ ఎకనామిక్స్, ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ తదితర కోర్సుల్లో ఇంతవరకు ప్రవేశాలు జరగలేదని పేర్కొన్నారు.
చదవండి: గురుకుల మహిళా కళాశాలలో రెండు పీజీ కోర్సులు
ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో 546 సీట్ల భర్తీ
ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల మొదటి విడత కౌన్సెలింగ్‌కు 932 మంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వగా.. 546 సీట్లు కేటాయించినట్టు ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి పేర్కొన్నారు. పీజీ కోర్సులు, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులలో సీట్లు సాధించిన విద్యార్థులు ఒరిజినల్ టీసీతో పాటు ఇతర సర్టిఫికెట్లను ఆయా కళాశాలల్లో ఈ నెల 18 వరకు రిపోర్టు చేయాలని సూచించారు.