గురుకుల మహిళా కళాశాలలో రెండు పీజీ కోర్సులు
Sakshi Education
విద్యారణ్యపురి: హనుమకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో (వరంగల్ వెస్ట్) ఈవిద్యాసంవత్సరం (2023–24)లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ పీజీ కోర్సులు ప్రవేశపెడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కాకతీయ యూనివర్సిటీ కూడా అనుమతినిచ్చిందని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.దయాకర్ తెలిపారు.
సీపీ గేట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈమూడో దశలో ఆయా పీజీ అడ్మిషన్లలో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. కళాశాలలో మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యాబోధనకు అర్హత అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు.
చదవండి: Lawyer to IPS Journey: న్యాయవాది నుంచి ఐపీఎస్ గా విజయం.. ఎలా..?
ఉచితంగా వసతి గృహ సౌకర్యంతోపాటు మెస్ సదుపాయం ఉందన్నారు. కాస్మోటిక్ చార్జెస్, ఫిజికల్ ఫిట్‌నెస్ జిమ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందన్నారు.
Published date : 30 Oct 2023 04:14PM