Skip to main content

Education: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య

పాడేరు రూరల్‌ : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్ధులకు నాణ్యమైన విద్య బోధించాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ ఆదేశించారు.
ITDA PO V. Abhishek's dedication to improving tribal education in Paderu Rural.  Quality education for tribal students  TDA PO V. Abhishek ensuring quality education for tribal students in Paderu Rural.

డిసెంబ‌ర్ 12న‌ఐటీడీఏ వీడియో కాన్పరెన్స్‌ హాల్లో 11 మండలాల సహాయ గిరిజన సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సికిల్‌సెల్‌ ఎనీమియా పరీక్షల కోసం హెచ్‌ఎంలకు సమాచారం అందితే ఏటీడబ్ల్యూఓల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

గిరిజన విద్యార్ధుల ఆరోగ్యంపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా ఇప్పటి ఏడాది విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మృతి చెందిన విద్యార్థుల వివరాలు, మృతికి గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్ధులు మృతి చెందితే ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మట్‌ ప్రకారం ఖఛ్ఛితమైన నివేదిక అందజేయాలన్నారు.

చదవండి: Andhra Pradesh: సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన బోధన

ఏటీడబ్ల్యూఓలు ప్రతి రోజు ఒక ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేయాలన్నారు. జీపీఎస్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులపై అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న చోట్ల సీఆర్టీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఆశ్రమ వసతి గృహాలకు టెండర్‌లో ఖారారు చేసిన నిత్యావసర సరకులు సరఫరా చేయాలని నిల్వ సరుకులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రామ సచివాలయాల వెల్ఫెర్‌ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు, 11 మండలాల ఏటీడబ్ల్యూఓలు పాల్గొన్నారు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 02:49PM

Photo Stories