Pharmacy Council of India: పారా మెడికల్ పరిధిలోకి ఫార్మసీ వృత్తి రాదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫార్మసీ వృత్తి పారా మెడికల్ కోర్సు పరిధిలోకి రాదని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి జూన్ 20న ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫార్మసీ స్వతంత్ర వృత్తి అని స్పష్టం చేశారు. దేశంలో ఫార్మసీ వృత్తిని పీసీఐ నియంత్రిస్తుందని తెలిపారు. ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ కింద పీసీఐ ఒక చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తుందన్నారు. ఫార్మసిస్ట్‌గా నమోదు చేసుకోవడానికి.. పీసీఐ ఫార్మసీ విద్యను నియంత్రిస్తుందని తెలిపారు. ఈనేపథ్యంలో ఫార్మసీ విద్యను పారా–మెడికల్ విద్యతో అనుసంధానం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
చదవండి:
Published date : 21 Jun 2023 01:46PM