NMC: కరీంనగర్ వైద్య కళాశాలకు అనుమతి
తాజా అనుమతితో 2023లో రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించి తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించిందని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు జూన్ 7న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌లో వైద్య కళాశాలు ప్రారంభమవుతాయన్నారు.
చదవండి: Medical Education: పీజీ వైద్య సీట్ల పంట.. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా ఇన్ని పీజీ సీట్లు
మెడికల్ కాలేజీల పనులు సకాలంలో పూర్తి చేయాలి: మంత్రి హరీశ్‌రావు ఆదేశం
ఈ సంవత్సరం ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీల పనులను సకాలంలో పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.35 కోట్లతో గాంధీ ఆసుపత్రిలోని ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ. 16.5 కోట్లతో గాంధీ, ఎంజీఎం, పేట్ల బుర్జు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఫెర్టిలిటీ
సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు.
చదవండి: YS Jagan Mohan Reddy: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఒకేసారి ఇన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరుగుదల
సత్వరం బస్తీ దవాఖానలు
బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్స్ ను వెంటనే ప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు కృషి చేయాలని, వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన మిడ్ వైఫ్ స్టాఫ్ నర్స్‌ల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, సాధారణ ప్రసవాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మిడ్ వైఫరీ నర్సుల పనితీరు వల్ల సి సెక్షన్లు తగ్గించడంలో మంచి మార్పు వచ్చిందన్నారు.