Skip to main content

IIT Bombay: ఒకసారి ఐఐటీ సీటు వదులుకుంటే ఇక నో చాన్స్‌

గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది.
IIT Bombay
ఒకసారి ఐఐటీ సీటు వదులుకుంటే ఇక నో చాన్స్‌

అలాంటివారు 2022 JEE Advanced రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్డ్–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్ లేదని పేర్కొంది. అదేవిధంగా Joint Seat Allocation Authority (JOSAA)–2021 కౌన్సెలింగ్లో కేటాయించిన IIT సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్ కౌన్సెలింగ్కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్డ్లో అర్హత మార్కులు సాధించినవారే Architect Aptitude Test (AAT)కి అర్హులని పేర్కొంది. JEE Main పేపర్ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్డ్ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది.

చదవండి: JEE Main: జేఈఈ మెయిన్ నిబంధనలు మార్చిన ఎన్టీఏ

జేఈఈ మెయిన్ కు నమోదు చేసిన కేటగిరీలే కొనసాగింపు

విద్యార్థులు తమ రిజర్వేషన్, తదితర కేటగిరీలకు సంబంధించి జేఈఈ మెయిన్ లో నమోదు చేసిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్కూ యథాతథంగా కొనసాగుతాయని ఐఐటీ బాంబే తెలిపింది. మెయిన్ లో తప్పుగా కేటగిరీలను నమోదు చేస్తే వాటిని అడ్వాన్స్డ్లో సరిచేసుకునేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ లో జనరల్ కేటగిరీ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద నమోదు చేసుకున్న విద్యార్థులు ఆ పత్రాలను సమర్పించకపోతే.. జనరల్ కటాఫ్ మార్కులు సాధిస్తేనే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇదే నిబంధన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీకి వర్తిస్తుందని తెలిపింది. అలాగే రాష్ట్రాల జాబితాలో ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీలో ఉండి.. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని కేటగిరీల విద్యార్థులు కూడా ఆ కేటగిరీ ప్రయోజనాలు పొందలేరని వెల్లడించింది. రక్షణ సర్వీసుల్లో పనిచేసేవారి పిల్లల రిజర్వేషన్లు కూడా కొన్ని కేటగిరీల వారికే వర్తించనున్నాయి. యుద్ధాల్లో లేదా శాంతిస్థాపన కార్యక్రమాల్లో మరణించిన, వికలాంగులైన, కనిపించకుండాపోయిన వారి సంతానానికి మాత్రమే ఈ కోటా సీట్లు దక్కుతాయి.

చదవండి: JEE Main 2022: తొలి సెషన్‌కు తుది ప్రిపరేషన్‌.. 90 ప్రశ్నలు - 300 మార్కులు

ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్

కాగా, జేఈఈ అడ్వాన్స్డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. వాస్తవానికి ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జూలై నెలల్లోకి వాయిదా పడడంతో అడ్వాన్స్డ్ పరీక్షను కూడా వాయిదా వేయక తప్పలేదు. కాగా జేఈఈ మెయిన్లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి.. అర్హత పొందిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.

Published date : 14 Jun 2022 01:19PM

Photo Stories