School Inspection : కస్తుర్భా బాలికల ఉన్నత పాఠశాలలో తనిఖీ!
Sakshi Education

అరకులోయ టౌన్: మండలంలోని యండపల్లివలస కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టీలను పరిశీలించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఏవోను ఆదేశించారు. విద్యార్థుల నుంచి మెనూ వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనాన్ని ఆయన వడ్డించారు.
Published date : 06 Jul 2024 12:28PM