Skip to main content

JEE Main 2022: తొలి సెషన్‌కు తుది ప్రిపరేషన్‌.. 90 ప్రశ్నలు - 300 మార్కులు

JEE Main Notification 2022 Exam preparation tips guidance
JEE Main Notification 2022 Exam preparation tips guidance

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్‌.. సంక్షిప్తంగా.. జేఈఈ–మెయిన్‌! ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా.. దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌  ఆఫ్‌ టెక్నాలజీ క్యాంపస్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే.. ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం లభిస్తుంది! దీంతోపాటు.. ఎంపీసీ విద్యార్థుల కలల గమ్యం ఐఐటీల్లో ప్రవేశానికి కూడా ఈ పరీక్షలో సత్తా చాటాల్సిందే! అంతటి కీలకమైన జేఈఈ మెయిన్‌–2022 తొలి సెషన్‌.. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఇప్పటివరకు సాగించిన ప్రిపరేషన్‌ ఒక ఎత్తయితే.. ప్రస్తుత సమయంలో పరీక్షకు ముందు చేసే అధ్యయనం విజయంలో నిర్ణయాత్మకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ–మెయిన్‌–2022 తొలి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా పరీక్ష విధానం, ఎగ్జామ్‌ డే టిప్స్‌..

 • ఈ నెల 20 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌
 • దాదాపు పది లక్షల మంది హాజరయ్యే అవకాశం
 • మెరుగైన స్కోర్‌కు మలి దశ ప్రిపరేషన్‌ ఎంతో కీలకం
 • ఈ స్కోర్‌తోనే నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర జీఎఫ్‌టీఐల్లో ప్రవేశం

జేఈఈ మెయిన్‌–2022 తొలి సెషన్‌కు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో 70 శాతం మంది రెండో సెషన్‌కు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జేఈఈ–మెయిన్‌ అభ్యర్థుల్లో అధిక శాతం మంది జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేందుకు మార్గంగా భావించి ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. కాని అడ్వాన్స్‌డ్‌కు జేఈఈ–మెయిన్‌ నుంచి 2.5 లక్షల మందినే ఎంపిక చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో సీట్లు పరిమితం. కాబట్టి ఐఐటీలకు దీటుగా నిలిచే ఎన్‌ఐటీలు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ సీటు సొంతం చేసుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Advantages of JEE Main Online Test

మలి దశ ప్రిపరేషన్‌

ఏ పోటీ పరీక్షకైనా పరీక్షకు ముందు సాగించే ప్రిపరేషన్‌ ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఇప్పటి నుంచి చూసుకుంటే జేఈఈ–మెయిన్‌ తొలి సెషన్‌ ప్రారంభానికి రెండు వారాల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ 14 రోజులను సమర్థంగా ఉపయోగించుకొని.. ఏకాగ్రతతో ప్రాక్టీస్, రివిజన్‌ చేస్తే చక్కటి స్కోర్‌ సాధించొచ్చు. ఇప్పటివరకు పుస్తకాల్లోని అన్ని యూనిట్లు, టాపిక్స్‌తో కుస్తీ పట్టిన విద్యార్థులు..ఇప్పుడు పరీక్షకు ముందు కొంత శాస్త్రీయంగా అడుగులు వేయాలన్నది నిపుణుల సలహా.

90 ప్రశ్నలు–300 మార్కులు

జేఈఈ మెయిన్‌లో అధికశాతం మంది హాజరయ్యే పేపర్‌1 మొత్తం 90 ప్రశ్నలు–300 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ 30 ప్రశ్నల్లో సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ కొశ్చన్స్‌ కాగా సెక్షన్‌ బీలో 10 ప్రశ్నలు న్యూమరికల్‌ వాల్యూ టైప్‌ ఉంటాయి. సెక్షన్‌ బీలోని ఈ పది ప్రశ్నల్లో విద్యార్థులు ఏవైనా ఐదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్‌ఏ, సెక్షన్‌బీ రెండింటిలోనూ నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు.

Also Read: Top 6 Don’ts to clear JEE/NEET exams in the 1st Attempt

సమయ పాలన

 • విద్యార్థులు ఈ 14 రోజులకు సంబంధించి టైం ప్లాన్‌ రూపొందించుకోవాలి. 
 • ప్రతి రోజూ కనీసం 12 గంటలు ప్రిపరేషన్‌ కోసం సమయం కేటాయించాలి.
 • మూడు సబ్జెక్ట్‌(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని..దానికి అనుగుణంగా మొత్తం సమయాన్ని విభజించుకోవాలి. ఉదాహరణకు ఇప్పటికీ చాలామంది విద్యార్థులు ఫిజిక్స్‌ అంటే క్లిష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్‌కు కొంత ఎక్కువ సమయం కేటాయించడం ఉపయుక్తంగా ఉంటుంది.
 • ప్రతి రోజు ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల పునశ్చరణకు పది నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి.
 • ఒక సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌కు కేటాయించుకున్న సమయంలో చివరి 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో.. ఆ రోజు చదివిన అంశాలకు సంబంధించి సెల్ఫ్‌ ఎవాల్యుయేషన్‌ చేసుకోవాలి.
 • వాస్తవానికి ఇది రివిజన్‌ సమయం. ఈపాటికి విద్యార్థులంతా షార్ట్‌ నోట్స్, సినాప్సిస్‌లు రూపొందించుకుని ఉంటారు.ఇప్పటికీ ఏమైనా అం శాలు కొత్తగా స్ఫురణకు వస్తే..వాటికి సంబంధించి అప్పటికే రాసుకున్న షార్ట్‌ నోట్స్‌లో అనుబంధంగా ఈ కొత్త టాపిక్స్‌ రాసుకోవాలి.
 • ప్రతి రోజు మూడు సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ పూర్తయ్యాక.. ఆ రోజు చదివిన అంశాలకు సంబంధించి మోడల్‌ టెస్ట్‌ రాయాలి. వాటిని తమ మెంటార్స్‌ లేదా ఫ్యాకల్టీ ద్వారా మూల్యాంకన చేయించుకోవాలి. 

Also read: Top 16 Do’s to clear JEE/NEET exams in the 1st Attempt

ఈజీ టు డిఫికల్ట్‌

ప్రస్తుతమున్న సమయంలో విద్యార్థులు తమ డైలీ ప్రిపరేషన్‌ ప్లాన్‌ను తమకు సులువైన అంశాలతో ప్రారంభించడం మేలు. దీనివల్ల మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికి బదులు పరీక్షలో వెయిటేజీ ఉందనో లేదా ముఖ్యమైనదని భావించి క్లిష్టమైన అంశాలతో ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే.. ఆ రోజంతా నిస్సారంగానే ఉంటుంది. ఇతర సబ్జెక్ట్‌లవైపు దృష్టి సాగదు.

రీడింగ్‌తోపాటు రైటింగ్‌

పరీక్షలో విజయంలో కీలక పాత్ర పోషించే మరో సాధనం.. వేగం. స్పీడ్‌ పెంచుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఇందుకోసం ఆయా యూనిట్‌ను లేదా టాపిక్‌ను చదువుతూనే దాన్ని నోట్స్‌ రాసుకోవడం, సమాధానాల ప్రాక్టీస్‌ అలవాటు చేసుకోవాలి. ఫలితంగా వేగం దానంతటదే పెరుగుతుంది. ఇది పరీక్ష రోజు కూడా మేలు చేస్తుంది.

ర్యాపిడ్‌ రివిజన్‌

 • ప్రస్తుత సమయంలో జేఈఈ మెయిన్‌ అభ్యర్థులు రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. రివిజన్‌ను వేగంగా సాగేలా ర్యాపిడ్‌ రివిజన్‌కు ఉపక్రమించాలి.
 • ఇందుకోసం.. అప్పటికే తాము రూపొందించుకున్న షార్ట్‌ నోట్స్, షార్ట్‌ కట్‌ ఫార్ములాలను ప్రాక్టీస్‌ చేయాలి. ఒక ప్రాబ్లమ్‌ను గరిష్టంగా మూడు లేదా నాలుగు స్టెప్స్‌లో సాధించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

Also Read: JEE Main 2022 Best Reference Books

మెమొరీ టిప్స్‌

మెమొరీ టిప్స్‌ అంటే.. ఒక సమస్యకు సంబంధించి ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకునే మార్గాలు. వీటిని అభ్యర్థులు తమకు అనుకూలమైన రీతిలో అనుసరించాలి. కొందరు విద్యార్థులకు విజువలైజేషన్‌ టెక్నిక్‌ సులభంగా ఉంటుంది. మరికొందరు పాయింటర్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఇలా.. విద్యార్థులు తమకు అనుకూలమైన రీతిలో మెమొరీ టిప్స్‌ను అనుసరిస్తే.. మరింత సులభంగా రివిజన్‌ పూర్తవుతుంది.

ప్రీవియస్‌ పేపర్ల సాధన

పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలని సబ్జెక్ట్‌ నిపుణులు, గత విజేతలు సూచిస్తున్నారు. ప్రీవియస్‌ పేపర్లను సాధించే క్రమంలో విద్యార్థులు రియల్‌ ఎగ్జామ్‌గానే భావించి పరీక్షకు లభించే మూడు గంటల సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఆ సమయం పూర్తవగానే సదరు ప్రీవియస్‌ పేపర్‌ ప్రాక్టీస్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. తర్వాత సదరు సమయంలో తాము ఎన్ని ప్రశ్నలు సాధించగలిగాం? ఎన్ని సరైన సమాధానాలున్నాయి? అనే విషయాలను విశ్లేషించుకోవాలి.

IIT-JEE Free coaching: ఐఐటీ–జేఈఈ, నీట్‌కు ఉచిత కోచింగ్‌ 

పరీక్ష ముందు రోజు

జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ముఖ్యంగా పరీక్ష ముందు రోజు ప్రిపరేషన్, రివిజన్, ర్యాపిడ్‌ రివిజన్‌ వంటి వాటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. పరీక్ష ముందు రోజు వీలైనంత మేరకు.. పరీక్ష రోజు అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టాలి. పరీక్ష కేంద్రం చిరునామాను ముందురోజే తెలుసుకోవాలి. ఫలితంగా పరీక్ష రోజు‘వన్‌ మినిట్‌ లేట్‌’అనే ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.

పరీక్ష రోజు.. ఇలా

 • వీలైనంత ముందుగా అంటే కనీసం గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
 • పరీక్ష ప్రారంభమైన తర్వాత తొలి పది నిమిషాలు ప్రశ్న పత్రాన్ని పరిశీలించాలి.
 • దాని ఆధారంగా సెక్షన్‌ల వారీగా ప్రశ్నల క్లిష్టత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి.
 • సులభంగా ఉన్న సెక్షన్‌ను ముందుగా పూర్తి చేసుకోవాలి. సులువైన సెక్షన్‌ను ముందుగా పూర్తి చేసుకోవడం వల్ల సదరు సెక్షన్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. దానికి బదులు ముందుగా కష్టమైన సెక్షన్‌ను ఎంపిక చేసుకుంటే.. మలి దశలో సులువైన సెక్షన్‌లో సైతం అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం లభించదు.

ఆరోగ్యం జాగ్రత్తగా

జేఈఈ మెయిన్‌ అభ్యర్థులు ఆరోగ్యం విషయంలోనూ శ్రద్ధ చూపాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే మైండ్‌ రిఫ్రెష్‌ అవుతుంది. అలా కాకుండా..సహచరులతో బేరీజు వేసుకుం టూ లేదా మరిన్ని టాపిక్స్‌ నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ సమయం ప్రిపరేషన్‌కు వెచ్చిస్తే సరైన విశ్రాంతి లభించక త్వరగా అలసటకు గురవుతారు.

జేఈఈ–మెయిన్‌–2022 తొలి సెషన్‌.. ముఖ్య సమాచారం

 • జూన్‌ 20 నుంచి 29 వరకు జేఈఈ–మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షలు
 • రోజుకు రెండు స్లాట్లలో పరీక్షలు
 • పరీక్ష సమయం: మూడు గంటలు
 • 300 మార్కులకు పరీక్ష నిర్వహణ
 • బీఈ/బీటెక్‌ అభ్యర్థులకు పేపర్‌–1 పరీక్ష
 • బీఆర్క్‌ అభ్యర్థులకు పేపర్‌–2ఎ పరీక్ష
 • బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అభ్యర్థులకు పేపర్‌–2బి పరీక్ష.
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in

సబ్జెక్టుల వారీగా కీలకాంశాలు

 • మ్యాథమెటిక్స్‌: కోఆర్టినేట్‌ జామెట్రీ–సర్కిల్, పారాబోలా,హైపర్‌బోలా,ఆల్‌జీబ్రా, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్, కాంప్లెక్స్‌ నెంబర్స్, ప్రాబబిలిటీ, వెక్టర్స్‌ అండ్‌ మ్యాట్రిక్స్‌.
 • ఫిజిక్స్‌: కైనమాటిక్స్, గ్రావిటేషన్, ఫ్లూయిడ్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, వేవ్స్‌ అండ్‌ సౌండ్, కెపాసిటర్స్‌ అండ్‌ ఎలక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్‌ ఇండక్షన్, ఆప్టిక్స్‌–మోడర్న్‌ ఫిజిక్స్‌.
 • కెమిస్ట్రీ: ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ–కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, పి బ్లాక్‌ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్‌ ఎలిమెంట్స్, కెమికల్‌ బాండింగ్, ఫిజికల్‌ కెమిస్ట్రీ–ఎలక్ట్రోకెమిస్ట్రీ, డైల్యూట్‌ సొల్యూషన్, కెమికల్‌–ఆయానిక్‌ ఈక్విలిబ్రియం, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ–ఆల్డిహైడ్స్‌–కీటోక్స్, అమైన్స్, ఆల్కై ల్, హాలిడ్స్‌–బయోమాలిక్యూల్‌.

Good News: ఈ పరీక్షలో చాయిస్‌ పెంపు.. 75 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల

ఒత్తిడి లేకుండా

జేఈఈ–మెయిన్‌ అభ్యర్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. విద్యార్థులు ఇత రులతో పోల్చుకుని లేదా పరీక్షకు సమయం దగ్గర పడుతుందనే ఆలోచనతో ఒత్తిడికి గురవుతారు. ఇది ప్రిపరేషన్‌పై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో నేర్చుకున్న అంశాలు కూడా మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ముందుగా మానసికంగా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండాలి.ప్రస్తుత సమయంలో ఎక్కువగా మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు ప్రాధాన్యమివ్వాలి. రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తొలి సెషన్‌లోనే రాణించేలా సన్నద్ధమవ్వాలి. 
–ఆర్‌.కేదారేశ్వర్, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 07 Jun 2022 04:05PM

Photo Stories