IIT-JEE Free coaching: ఐఐటీ–జేఈఈ, నీట్‌కు ఉచిత కోచింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐఐటీ–జేఈఈ, నీట్ రాసే విద్యార్థులకు 60 రోజుల (షార్ట్ టర్మ్) ఉచిత శిక్షణ (క్రాష్ కోర్స్) ఇవ్వనున్నట్టు ఏపీ సాంఘిక సంక్షేమ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి తెలిపారు. ఇంటర్ పరీక్ష తర్వాత రాష్ట్రంలో 8 కేంద్రాల్లో ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. విశాఖ జిల్లా మధురవాడ, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, నెల్లూరు జిల్లా బోగోలు, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్ గురుకులాల్లో బాలికలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. బాలురకు తూర్పు గోదావరి జిల్లా కొత్తూరు, గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, తిరుపతి జిల్లా చిలుకూరు గురుకులాల్లో సబ్జెక్టు నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తామని వివరించారు.
Also read: CEPET Free training:నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
Published date : 30 Apr 2022 03:27PM