CEPET Free training:నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ‘ మెషీన్ ఆపరేటర్–ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ’ అనే అంశంపై 6 నెలల నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సామాజిక సేవలో భాగంగా 40 మంది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు సీపెట్ విజయవాడ జేడీ సీహెచ్ శేఖర్ గురువారం పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 18–30 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం సరి్టఫికెట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఉపాధి కలి్పంచనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 6300147965,7093538843 నంబర్‌లలో సంప్రదించాల్సిందిగా కోరారు.
Also read: Transport Constable Notification: 677 అబ్కారీ, రవాణా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్