Good News: ఈ పరీక్షలో చాయిస్ పెంపు.. 75 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల
ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వెల్లడించింది. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా నెల కొన్న విభిన్న పరిస్థితులు, కరోనా మూలంగా విద్యాసంస్థలు మూతపడటాన్ని కేంద్రం పరి గణనలోకి తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇం టర్ తత్సమానమైన పరీక్ష సిలబస్‌ను కుదిం చారు. మన రాష్ట్రం లోనూ ఇంటర్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేశారు. ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లోనూ సిలబస్ తగ్గించాలని అన్ని రాష్ట్రాలు కోరాయి. సాధారణంగా జేఈఈ మెయిన్స్ లో ప్రతీ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రస్తుతం 25 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపో తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఒక్కో దానిలో 30 ప్రశ్నలు ఇస్తే.. 25 ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది. గతంలో 90 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 360 మార్కు లకు పేపర్ ఉండేది. ఇప్పుడు 75 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటాయి.
చదవండి:
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) వీడియో గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) ప్రివియస్ పేపర్స్
ప్రిపరేషన్ కు మంచి అవకాశం
చాయిస్ పెంచడం వల్ల కొంత సిలబస్ తగ్గినట్టే. ఇంటర్ పరీక్షల తర్వాత విద్యార్థులకు నెల రోజుల వ్యవధి ఉంటుంది. కాబట్టి ఇప్పట్నుంచే మెయిన్స్ పై దృష్టి పెడితే మంచి స్కోర్ చేసే వీలుంది. కరోనా వచ్చిన తర్వాత గత పేపర్లను పరిశీలిస్తే ప్రశ్నలు కాస్త సరళంగానే ఉంటున్నాయి. కాబట్టి మూడేళ్ల పేపర్లను ప్రిపరేషన్ కు తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
– ఎంఎన్ రావు (మెయిన్స్ గణితశాస్త్ర బోధకుడు)