Teaching Style : ఉపాధ్యాయులు తమ బోధనా సరిళిని ఎప్పటికప్పుడు మార్చాలి..!
శ్రీకాకుళం: ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులని, మారుతున్న పరిస్థితులను బట్టి బోధనా సరళిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని పాఠశాల విద్య రాష్ట్ర పరిశీలకులు ఇ.ప్రసాదరావు అన్నారు. జిల్లాలో జూలై 1 నుంచి మొదలైన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మొత్తం 9 రోజులపాటు జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపాడు, ఎచ్చెర్ల, టెక్కలి, సోంపేటలోని 4 కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల అమలు తీరును రాష్ట్ర పరిశీలకులు ప్రసాదరావు మెచ్చుకున్నారు.
Selected Candidates : డీఎల్‌టీసీ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా.. ఎంపికైన వారు..!
స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెద్దపాడు శిక్షణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు అధిపతిగా ఉంటూ ఉపాధ్యాయుల బోధన సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వారు పరిశీలించినది మదింపు చేయడానికి, ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇవ్వటానికి ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ తోడ్పడుతుందన్నారు. టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఉద్దేశం చాలా గొ ప్పదని, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులంతా బాటలు వేయాలని సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి గుంట లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ నక్క రామకృష్ణ, సీఎంఓ పేడాడ ప్రభాకరరావు, సాల్ట్ కోఆర్డినేటర్ నాగరాజు, ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి, మాస్టర్ ట్రెయినర్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
IIM 2024 Topper : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పరీక్షల్లో అంధురాలి ప్రతిభ
Tags
- State Inspectors of School Education
- training centers
- teachers training
- students education
- teaching style for students
- Teachers
- Students
- sudden inspection
- training for teachers
- Schools and Colleges
- teachers duty
- Education News
- Sakshi Education News
- SrikakulamEducation
- TeacherTraining
- EducationInspector
- TeachingPatterns
- EternalStudents
- July1Training
- EducationDevelopment