Skip to main content

JEE Main: జేఈఈ మెయిన్ నిబంధనలు మార్చిన ఎన్టీఏ

జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ అభ్యర్థులు దరఖాస్తులో ఏ రాష్ట్ర చిరునామా ఇచ్చారో, ఆ రాష్ట్రంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
JEE Main
జేఈఈ మెయిన్ నిబంధనలు మార్చిన ఎన్టీఏ

అభ్యర్థులు దరఖాస్తుల్లో నమోదు చేసే శాశ్వత లేదా ప్రస్తుత చిరునామా ఉన్న రాష్ట్రంలోని నాలుగు నగరాలకు ప్రాధాన్యత ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. గత ఏడాది జేఈఈ మెయిన్ సందర్భంగా ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని కొందరు అభ్యర్థులు తొలి చాన్సులో ఆ రాష్ట్రం నుంచి పరీక్ష రాసి నాలుగో విడతలో పక్కనే ఉన్న హరియాణా వంటి వేరే రాష్ట్రాల్లో పరీక్ష రాశారు. తొలిసారి కనిష్ట మార్కులు సాధించిన వారికి నాలుగో విడతలో టాప్‌ మార్కులు లభించాయి. దానిపై సీబీఐ విచారణ జరపగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. 25 మంది అభ్యర్థులను డిబార్‌ చేశారు. సీబీఐ ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ తాజా నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఏ మార్చి 1న జేఈఈ మెయిన్ –2022 నోటిఫికేషన్ విడుదల చేసి, సాయంత్రం నుంచే రిజిస్ర్టేషన్లను కూడా చేపట్టింది. రిజి్రస్టేషన్ల ప్రక్రియను సరళతరం చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డు కోసం ముందుగా పేరు నమోదు చేయాలి. రెండో దశలో వ్యక్తిగత వివరాలు, పేపర్, పరీక్ష నగరాల నమోదు చేయాలి. ఇలా దరఖాస్తును పూరించిన అనంతరం మూడో దశలో ఫీజు చెల్లించాలి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో రెండు విడతల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తోంది. రెండు దశల పరీక్షలకు దరఖాస్తులను వేర్వేరుగా సమరి్పంచాలి. ఒకే సెషన్ కు బహుళ దరఖాస్తులను అనుమతించరు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 13 భాషల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తోంది. పరీక్షకు వయసుతో సంబంధం లేకుండా 2020, 2021లలో ఇంటర్‌ పూర్తిచేసిన వారితో పాటు 2022లో ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఐఐటీ తదితర విద్యా సంస్థలు విధించిన వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు పరిగణనలోకి తీసుకొని పరీక్షకు దరఖాస్తు చేయాలని ఎన్టీఏ సూచించింది. 

చదవండి: 

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) వీడియో గైడెన్స్

జనరల్‌ నుంచి రిజర్వుడ్‌లోకి మారితే ఫీజు వాపసు రాదు

రిజి్రస్టేషన్ ప్రక్రియలో దరఖాస్తు సమర్పణ అనంతరం సవరణలు చేసుకోవచ్చు. రిజర్వేషన్ తదితర అంశాల ఆప్షన్లను సరిచూసుకొని మార్పులు చేసుకోవచ్చు. రిజర్వుడ్‌ కేటగిరీ నుంచి జనరల్‌కు మారే అభ్యర్థులు వ్యత్యాసపు ఫీజును ఎనీ్టఏకు చెల్లించాలి. అదే జనరల్‌ నుంచి రిజర్వుడ్‌ కేటగిరీకి మారే వారికి వ్యత్యాసపు మొత్తాన్ని వాపసు ఇవ్వబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. పేపర్ల వారీగా రిజర్వుడ్‌ వర్గాలకు రూ.325, ఇతరులకు రూ.650, రెండు పేపర్లకు కలిపి రిజర్వుడ్‌ వర్గాలకు రూ. 650, ఇతరులకు రూ.1,300 ఫీజుగా ఎన్టీఏ నిర్ణయించింది. 

చదవండి: ​​​​​​​

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) ప్రివియస్‌ పేపర్స్

సొంత స్క్రైబ్‌కు అవకాశం లేదు

దివ్యాంగ అభ్యర్థులు వారి తరఫున పరీక్ష రాసేందుకు ఎన్టీఏనే స్క్రైబ్‌ను కేటాయిస్తుంది. గతంలో అభ్యర్థులు వారి స్క్రైబ్‌ను ముందుగా పేర్కొంటే వారిని అనుమతించేది. కానీ ఈసారి స్క్రైబ్‌ ఆప్షన్ ను తొలగించి, ఎన్టీఏనే ఏర్పాటు చేస్తోంది.

జేఈఈ అడ్వాన్స్ కు అదనపు అభ్యర్థులు

జేఈఈ మెయిన్ లో మెరిట్‌లో ఉన్న 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్‌కు అనుమతించనున్నారు. ఇప్పటికే ముంబై ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్‌ – 2022 ను జూలై 3న నిర్వహించేలా షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ పరీక్షకు 2022 మెయిన్ అభ్యర్థులతో పాటు 2020లో మెయిన్ రాసి అర్హత సాధించిన వారిని సైతం అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. వీరి కారణంగా ప్రస్తుత మెయిన్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించకుండా అదనపు అభ్యర్థులుగా వీరిని పరిగణిస్తారు. 

Published date : 21 Mar 2022 03:43PM

Photo Stories