Skip to main content

Awareness Program : ఇన్స్‌పైర్‌ అవార్డ్స్ నామినేష‌న్స్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం..

Awareness program on INSPIRE Awards nominations

ఎదులాపురం: ఇన్స్‌పైర్‌ అవార్డు 2024 – 25 ఆన్‌లైన్‌ నామినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. టీ–శాట్‌ నెట్‌వర్క్‌ (నిపుణ చానెల్‌) ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, యూపీఎస్‌, హైస్కూల్‌ పాఠశాలల్లో చదివే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. భౌతిక, జీవశాస్త్ర, గణిత ఉపాధ్యాయులు తప్పకుండా పాల్గొనేలా చూడాలని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వివరాలకు సెక్టోరియల్‌ అధికారి శ్రీకాంత్‌, జిల్లా సైన్స్‌ అధికారి రఘురమణను 9440125312, 9440060288 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

NEET UG 2024 Counselling Postponed: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా.. షెడ్యూల్‌ మళ్లీ ఎప్పుడంటే..

Published date : 06 Jul 2024 03:34PM

Photo Stories