B Arch: బీఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
2021–22 విద్యా సంవత్సరానికి బీఆర్క్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు క ల్పించనున్నట్లు వివరించారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్టు ఎన్ ఏటీఏ–2021లో లేదా జేఈఈ మెయిన్స్ పేపర్–2 (బీఆర్క్)–2021లో అర్హత సాధించిన వారు, 10 ప్లస్ 2 లేదా 10 ప్లస్ 3 (మేథమెటిక్స్‌తో డిప్లొమో) పూర్తిచేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల సర్టీఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లు ఇవ్వడం, ప్రవేశం పొందిన అనంతరం ఫీజుల చెల్లింపు వంటి ప్రక్రియలన్నీ ఆన్ లైన్ విధానంలో జరుగుతాయని వివరించారు. నోటిఫికేషన్, అడ్మిషన్ల ప్రక్రియ విధానం, ఇతర వివరాలకు www.andhraunivercity.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
చదవండి:
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. టైంటేబుల్‌లో మార్పులు
బాలికలకూ శుభవార్త.. ఈ ఏడాది నుంచి ఈ స్కూళ్లు, కాలేజీలో అడ్మిషన్లు