Skip to main content

Department of Education: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష తేదీ ఇదే..

భూపాలపల్లి అర్బన్‌: 2023–24 విద్యా సంవత్సరానికి గాను నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్షిప్‌ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) డిసెంబ‌ర్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాంకుమార్‌ డిసెంబ‌ర్ 4న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
National Means Merit Scholarship Test Alert  NMMS exam date   NMMS 2023-24  NMMS Scholarship Test 2023-24 on December 10

పరీ క్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణకు కాటారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు భూపాలపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు.

చదవండి: Scholarship: ప్రతిభకు ప్రోత్సాహం

కాటారం పరీక్ష కేంద్రంలో కాటారం, మహదేవపూర్‌, మల్హర్‌, మహాముత్తారం, పలిమెల మండలాలకు సంబంధించిన 148మంది విద్యార్థులు, భూపాలపల్లి పరీక్ష కేంద్రంలో భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు సంబంధించిన 233మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలి పారు. ఈ పరీక్ష నిర్వహించుటకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు హాల్‌ టికెట్లను సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

Published date : 06 Dec 2023 10:56AM

Photo Stories