Skip to main content

Scholarship Exam: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష తేదీ ఇదే..

కర్నూలు సిటీ: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌(ఎన్‌ఎంఎంఎస్‌–జాతీయ ఉపకార వేతన)పరీక్ష వచ్చే నెల 3వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ డా.వి రంగారెడ్డి న‌వంబ‌ర్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
NMMS exam date NMMS National Scholarship Exam Announcement

ఈ పరీక్షకు 3,799 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కర్నూలులో 6, ఆదోనిలో 11 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థులు గంట ముందుగాను కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌ టికెట్లను www.bse. ap.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్‌

కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం స్కాలర్‌షిప్‌’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ న‌వంబ‌ర్ 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం స్కాలర్‌షిప్‌ కోసం డిసెంబర్‌ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్‌ఐవోలు అన్ని మేనేజ్‌మెంట్స్‌ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు.

విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా  http://www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

చదవండి:

NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌.. ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్‌షిప్‌

AICTE: టెక్‌ విద్యార్థులకు ‘ఉపకారం’

Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

Published date : 30 Nov 2023 12:28PM

Photo Stories