కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాకు కత్తెర?
Sakshi Education
కేంద్రీయ విద్యాలయాల్లో ఏటా పదిమంది విద్యార్థులను సిఫార్సు చేసే ఎంపీల అధికారానికి కేంద్రం కత్తెర వేయబోతున్నట్లు తెలిసింది. మార్చి 21న ఈ విషయం లోక్‌సభలో చర్చకు వచ్చింది. పది సీట్ల కోటా చాలడం లేదని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు. ఎంపీలకు వందల్లో అభ్యర్థనలు వస్తున్నందున కోటా పెంచడమో పూర్తిగా తొలగించడమో చేయాలన్నారు. కోటాను ఎత్తేయడంపై ఇతర పార్టీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను స్పీకర్ ఆదేశించారు. రద్దును పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.
చదవండి:
Kendriya Vidyalaya: 1వ తరగతి ప్రవేశాల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..
Published date : 22 Mar 2022 05:31PM