Tenth Class: మెమోతో IAS ఆఫీసర్ మోటివేషన్..
అది చూసిన నెటిజన్స్ ‘Inspiring’ అంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఆ మార్కులకే అలా ప్రశంసించడమెందుకంటే.. ఆయన ఇప్పుడో IAS ఆఫీసర్. అన్ని రాష్ట్రాల్లో ఇటీవలే పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడని నేపథ్యంలో... మార్కులతో పనే లేదని నిరూపించడం కోసం తన మెమో షేర్ చేశారు చత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన ఈ IAS . కేవలం తరగతి గదిలో చదువుతో వచ్చే మార్కులతో భవిష్యత్ నిర్ణయమైపోదని, పట్టుదల ఉంటే ఫ్యూచర్ అంతా మనదేనని సందేశమిచ్చారు. గతంలో తన తోటి IAS ఆఫీసర్, గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్ Tushar Sumera టెన్త్ మెమోను కూడా షేర్ చేశారు. టెన్త్‌లో కనీస మార్కులతో పాస్ అయిన తుషార్... IAS అయిన వైనాన్ని వివరించారు అవనీష్. ఇంకేముంది ఆయన పోస్టులు కాస్తా వైరల్ అయిపోయాయి. లక్షల మంది లైక్ చేశారు.
చదవండి:
- సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయనకే..
- ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్ అధికారి పిల్లలు..
- ఇంటర్నెట్ ద్వారా చదివా.. ఐఏఎస్ కొట్టా.. చివరికి..