Skip to main content

IAS Inspiring Success Story: ఇంటర్నెట్‌ ద్వారా చదివా.. ఐఏఎస్ కొట్టా.. చివ‌రికి..

టాలెంట్ ఉండి.. క‌ష్ట‌ప‌డే వాళ్లు బోలెడు మంది. వాళ్లలో అనుకృతి శర్మ ఒకరు. ఈ స్టోరీ చ‌దివితే మీకు ఎంతో కొంత ప్రేరణ కలుగుతుంది.
anukriti sharma ias
Anukriti Sharma, IAS

ఈమె అధికారిక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఈమె ఎప్పుడూ సివిల్స్ కోచింగ్ తీసుకోలేదు. వేరే ఏ ప‌రీక్ష‌లు కూడా రాయలేదు. కానీ ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వ‌ల‌న్నా కలను మాత్రం నెరవేర్చుకున్నారు. 2014లో సివిల్స్‌లో ఈమెకు 355వ ర్యాంక్ వచ్చింది. అలాగే 2018లో   133వ ర్యాంక్ సాధించారు. మీ కోసం అనుకృతి శర్మ స‌క్సెస్ జ‌ర్నీ..

UPSC Civils Ranker : అమ్మ క‌ల‌ను నిజం చేశానిలా..| ఆ ఒక్క మార్క్ వ‌ల్లే పోయింది

కుటుంబ నేప‌థ్యం :

anukriti sharma ias family


ఈమె రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఈమె తల్లి కాలేజీ నుంచి రిటైర్ అయ్యారు. ఈమె పెళ్లి తర్వాత ఐఏఎస్ అవ్వాలనే కోరిక కలిగింది. ప్ర‌య‌త్నం చేసి.. అనుకున్న‌ది సాధించారు.

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే.. 

ఎడ్యుకేష‌న్ :
రాజస్థాన్.. జైపూర్‌లోని ఇండో భారత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. 2012లో కోల్‌కతాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో బీఎస్ఎంఎస్ (BSMS) (జియాలజీ)లో డిగ్రీ పొందారు. నెట్ ప‌రీక్ష‌ రాసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.

UPSC Civils Ranker Sridhar Interview : అసెంబ్లీ వ‌ద్ద ఆ ఘ‌ట‌న చూసే.. సివిల్స్ వైపు వ‌చ్చా..

ఇంటర్నెట్ ద్వారా మాత్ర‌మే..

IAS Success Story


సాధారంగా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు కోచింగ్ తీసుకుంటూ.. లక్షల్లో ఫీజులు చెల్లిస్తారు. కానీ అనుకృతి శర్మ మాత్రం ఇంటర్నెట్‌లోనే చదివి.. సివిల్స్‌లో ర్యాంక్ కొట్టారు.ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచించాను. సమాధానాలు రాయడంలో నాకు నేనుగా బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నాను. అది కలిసొచ్చింది. ఇదే నాకు నేనుగా ప్రాక్టీస్ అయ్యాను అని ఆమె చెప్పారు. మొదటి ప్రయత్నంలో ఆమె విజయం సాధించలేదు. అలాగే మొత్తం నాలుగు సార్లు ప్రయత్నించారు. ర్యాంక్ సరిగ్గా రాక‌పోవ‌డంతో.. మూడుసార్లు ఫెయిలయ్యారు.

UPSC Civils Results 2022: ప‌రీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..

ఇలా చ‌దివితే..
కంటిన్యూగా హార్డ్ వర్క్ చేసి.. మరింత బెటర్‌గా ప్రిపేర్ అయితే.. ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు సివిల్స్ సెక్సెస్ సాధించగలరు అని అనుకృతి తెలిపారు. మీరు చేయాల్సిందల్లా మీకు మీరుగా తరచూ ప్రిపేర్ అవ్వడమే అని ఆమె వివరించారు.

UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

Published date : 04 Jul 2022 08:09PM

Photo Stories