MLHP: నియామక పరీక్ష తేదీ.. జోన్ల వారీగా ఖాళీలు ఇలా..
డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి గత ఆగస్టులో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా జిల్లాకు ఒకటి నుంచి రెండు పరీక్ష కేంద్రాలు గుర్తించారు. నియామక పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షనల్స్ ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు సమయం 3 గంటలు ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.
చదవండి: ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు: మరో 7,000 పోస్టుల భర్తీకి కసరత్తులు!
రాష్ట్ర వ్యాప్తంగా 10,032
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో వైద్య సేవలు అందించడానికి బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమిస్తున్నారు. ఇప్పటికే 8,351 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
చదవండి: ఎంఎల్‌హెచ్‌పీ ప్రొవిజనల్ జాబితా విడుదల
జోన్‌ల వారీగా ఖాళీలు ఇలా..
జోన్–1 (ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ): 233
జోన్–2 (ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా): 658
జోన్–3 (ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు): 494
జోన్–4 (ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు): 296