ఎంఎల్‌హెచ్‌పీ ప్రొవిజనల్ జాబితా విడుదల
Sakshi Education
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ల వారీగా అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ విడుదల చేసింది.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు http://hmfw.ap.gov.in/, cfw.ap.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా 25వ తేదీలోగా సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల నియామకానికి వైద్యశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12,543 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రొవిజనల్ జాబితాను విడుదల చేశారు. జోన్ ల వారీగా విశాఖపట్నంలో 974, రాజమండ్రి 1,446, గుంటూరు 967, వైఎస్సార్ కడప 1,368 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Published date : 22 Apr 2022 02:53PM