Skip to main content

ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు: మరో 7,000 పోస్టుల భర్తీకి కసరత్తులు!

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7,000 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్స్‌) నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే 2,920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్యమిషన్‌ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ ఇచ్చి మెరిట్‌ ప్రాతిపదికన మిగతా నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ గత రెండేళ్లుగా 9,500కిపైగా శాశ్వత నియామకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉండేలా నియామకాలు పూర్తి చేశారు. వేలాది మంది స్టాఫ్‌ నర్సులను నియమించారు.

గత ఏడాది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం ఇలా..

జిల్లా

సంఖ్య

శ్రీకాకుళం

173

విజయనగరం

187

విశాఖపట్నం

247

తూ.గోదావరి

274

ప.గోదావరి

248

కష్ణా

237

గుంటూరు

284

ప్రకాశం

204

నెల్లూరు

166

చిత్తూరు

268

కడప

172

అనంతపురం

241

కర్నూలు

219


ప్రతి క్లినిక్‌లో సిబ్బంది, మందులు
‘ఈ ఏడాది చివరి నాటికి 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎఎన్‌ఎం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి క్లినిక్‌లో మందులు అందుబాబులో ఉంటాయి. ప్రాథమిక వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతాం’
–కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ
Published date : 04 Jun 2021 03:54PM

Photo Stories