AP : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కనీస ఫీజు రూ.42,500
ఈ ప్రతిపాదనపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020–23 సంవత్సరాలకు ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం 2022లో హైకోర్టులో పిటిషన్లు వేసింది.
ఇవీ చదవండి: ఫీజులపై క్లారిటీ వచ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్...?
ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫారసులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయడం వల్ల కళాశాలలు నష్టపోతున్నాయన్నారు.
Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh | Telangana
సదుపాయాల ఆధారంగానే ఫీజులు: ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిసూ ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజును ఖరారు చేయలేదని తెలిపారు. ఫీజులు ఖరారు చేసేందుకు అన్ని వివరాలు సమర్పించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించామన్నారు. చాలా కళాశాలలు ఇప్పటికీ ఆ వివరాలు సమర్పించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
➤☛ AP EAPCET College Predictor (Click Here)
త్వరలో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ మొదలు కాబోతుందన్నారు. ఆ ప్రక్రియను కొనసాగించుకునేందుకు అనుమతినివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ఉన్న ఫీజుకు అదనంగా 10 శాతం ఫీజును వసూలు చేసుకునేందుకు అనుమతినిస్తామన్నారు.