Skip to main content

Mid Day Meal: కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలి

డిచ్‌పల్లి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు విగ్నేష్‌ డిమాండ్‌ చేశారు.
Mid Day Meal
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలి

ఈమేరకు ఆగ‌స్టు 17న‌ సంఘం ఆధ్వర్యంలో డిచ్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. విగ్నేష్‌ విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఆగ‌స్టు 21న కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు ప్రసాద్‌, వెంకటేష్‌, సంధ్యారెడ్డి, మిథున్‌, లక్ష్మి, ప్రజ్ఞ, ఆకాష్‌ పాల్గొన్నారు.

చదవండి:

Education News: ఇక‌పై మ‌ధ్యాహ్న భోజ‌నంలో రాగి జావ... ఎప్ప‌టి నుంచి అంటే...

PM-POSHAN: ఏ పథకంగా మధ్యాహ్న భోజన పథకం పేరును మార్పు చేశారు?

Published date : 18 Aug 2023 04:57PM

Photo Stories