MANUU: మెరిట్ ఆధారిత ప్రవేశాలు
వీటికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని సెప్టెంబర్ 6 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మెరిట్ ఆధారిత కోర్సుల కోసం ఎడిటింగ్ ఎంపిక సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, పర్షియన్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనమిక్స్, సోషియాలజీ, లీగల్ స్టడీస్, జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంకామ్, ఎమ్మెస్సీ(గణితం), ఉర్దూ, ఫ్రెంచ్, రష్యన్ పాష్టోలలో సర్టిఫికెట్ కోర్సు కాకుండా ఉర్దూ, హిందీ, అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ స్టడీస్, గజల్ అప్రిసియేషన్ (తహసీన్–ఏ–గజల్) వంటి పార్ట్‌టైమ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు, ఈ–ప్రాస్పెక్టస్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని సూచించారు.
చదవండి: