Little India Utsav: ఐహెచ్‌ఎమ్‌లో లిటిల్ ఇండియా ఉత్సవ్
విద్యానగర్‌లోని ఐహెచ్‌ఎమ్ వేదికగా జనవరి 26న ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ 28వ తేదీ వరకు కొనసాగనుంది. ‘తిరంగ’ నేపథ్యంతో ఏర్పాటు చేసిన ఈ పండుగ పాక వైవిధ్యం, వ్యాపార సమ్మేళనానికి హామీ నిలుస్తుంది. ఈ సందర్భంగా నిర్వాహాకులు మాట్లాడుతూ., భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కింద లిటిల్ ఇండియా– ఐహెచ్‌ఎమ్–హెచ్ ఉత్సవ్ ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు.
చదవండి: Job Opportunities: హోటల్ మేనేజ్‌మెంట్‌తో ఉద్యోగ అవకాశాలు
ఆహార ఔత్సాహికులు, విద్యార్థులు, నిపుణులను ఆహ్వానించడంలో భాగంగా ఈ వేడుకలు మరింత ఆసక్తిని రేకెత్తించాయని తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో తెలంగాణతో పాటు హర్యానా, సిక్కిం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళతో సహా ప్రాంతీయ వంటకాలను రుచిచూపిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవ్‌లో పసందైన రుచుల సమ్మేళనంతో పాటు మ్యూజిక్, డ్యాన్స్, ఫోటోగ్రఫీ, స్టాండ్–అప్ కామెడీ వంటి విభిన్న కార్యక్రమాలు అలరిస్తున్నాయి.