Skip to main content

Job Opportunities: హోటల్‌ మేనేజ్‌మెంట్‌తో ఉద్యోగ అవకాశాలు

Job Opportunities Abroad  Job Opportunities with Hotel Management  Hotel Management Diploma

మహబూబాబాద్‌: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లా మా లేదా డిగ్రీ, హోటల్‌ పరిశ్రమలో ఫుడ్‌ అండ్‌ బే వేరేజెస్‌ సర్వీస్‌ చేసిన అనుభవం, పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్నవారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ హైదరాబాద్‌ ద్వారా జపాన్‌లో నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షాయాభై వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలస మా ర్గాల ద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను సులభత రం చేయడంలో టామ్‌ కామ్‌ అభ్యర్థులకు సాయం చేస్తుందని తెలిపారు. ఈనెల 16న జిల్లా ఉపాధి కార్యాలయం ప్రభుత్వ ఐటీఐ(బాలుర) ములుగురోడ్డు, హనుమకొండ జిల్లా ఉపాధి కార్యాలయంలో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ప్రభుత్వ ఐటీఐ బాయ్స్‌ క్యాంపస్‌, ములుగు రోడ్డు వరంగల్‌లో జరిగే ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. 22 నుంచి 27 సంవత్సరాల వారు అర్హులని స్ప ష్టం చేశారు. రెజ్యుమ్‌ సంబంధిత డాక్యుమెంట్లతో హాజరు కావాల్సిందిగా కోరారు. సెలెక్ట్‌ అయిన అ భ్యర్థులకు జపనీస్‌ భాషపై రెసిడెన్షియల్‌ శిక్షణ, జపాన్‌లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారని తెలిపారు. వివరాల కోసం 78935 66493, 98496 39539 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు .
 

sakshi education whatsapp channel image link

Published date : 18 Dec 2023 09:07AM

Photo Stories